వివాదాస్పద అండర్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని, మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు వీటిలో ఉన్నాయి.
అయితే నీట్ పేపర్ లీక్ అయిందనేది స్పష్టం చేసింది సీజేఐ. మే 05న దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. సుప్రీంకోర్టులో ఇవాళ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. పేపర్ లీక్ చేసిన వారిని ఎలా నిర్దేశిస్తారని ప్రశ్నించింది సీజేఐ. సోషల్ మీడియా ద్వారా లీక్ అయింటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఫలితాలను హోల్డ్ లో పెట్టారని ప్రశ్నించింది సీజేఐ. పేపర్ లీక్ కేసు పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐ కి సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహించాలనేది లాస్ట్ ఆప్సన్.. మరోవైపు ఈ కేసును గురువారానికి వాయిదా వేశారు.