తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇకపైన పదవ తరగతి ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించేనున్నట్లు సమాచారం అందుతుంది. పదవ తరగతి ప్రశ్నా పత్రాల పైన…. క్యూ ఆర్ కోడ్ అలాగే సీరియల్ నెంబర్లను కూడా తెలంగాణ విద్యాశాఖ ముద్రించిన ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందట తెలంగాణ విద్యాశాఖ.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/It-is-informed-that-QR-code-will-be-printed-on-class-10-question-papers.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి క్యూ ఆర్ కోడ్ విధానాన్ని కూడా తీసుకువస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇంటర్ హాల్ టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్ లకు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మెసేజ్లను క్లిక్ చేస్తే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.