పురుషుల్లో ఈ సమస్యలు ఉంటే అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు..!

-

ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చిన్నదే కదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. సమస్య చిన్నదైనా పెద్దదైనా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు ప్రమాదం ఉండదు. పురుషుల్లో కనుక ఈ సమస్యలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తప్పక డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.

యూరిన్ వెళ్లేటప్పుడు నొప్పి కలగడం లేదా యూరిన్ రంగు మారడం:

యూరిన్ రంగు మారడం లేదా యూరిన్ వెళ్లేటప్పుడు నొప్పి కలగడం కనుక పురుషుల్లో ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలానే యూరిన్ కి వెళ్ళినప్పుడు రక్తం పడడం కూడా అనారోగ్య సమస్యలకు సంకేతం. ప్రోస్టేట్ క్యాన్సర్ కి ముందు కూడా ఈ లక్షణం ఉంటుంది అయితే సమస్య ఏదైనా సరే ఇటువంటి లక్షణాలు ఉంటే అస్సలు అశ్రద్ధ చేయొద్దు. కాబట్టి తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి.

చెస్ట్ పెయిన్ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుల

పురుషుల్లో చేస్త పెయిన్ కానీ శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఉంటే అస్సలు అశ్రద్ధ చేయొద్దు ఒక్కోక్కసారి అనుకోకుండా చెస్ట్ పెయిన్ వస్తుంది. అటువంటి సమయంలో డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే హృదయ సంబంధిత సమస్యలు లేదా జీవన విధానంలో చేసే తప్పులు వల్ల ఈ సమస్యలు వస్తాయి.

అతిగా దాహం వేయటం:

రోజుకి కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే అతిగా దాహం వేసింది అంటే కచ్చితంగా దానిని అశ్రద్ధ చేయకూడదు.

మెమరీ లాస్:

ఏదైనా మరచి పోవడం లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అసలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇది మానసిక సమస్యలకి సంకేతం. కాబట్టి ఈ సమస్య వచ్చినా కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version