ఇది ప్రజల జాగీరు, నాయకుల జాగీరు కాదు అని ఈటల రాజేందర్ అన్నారు.ప్రజల అవసరాల దృష్ట్యా కేంద్రం నుండి నిధులు తీసుకురావడమే మా కర్తవ్యం. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ తీరుస్తాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటపడి పనులు చేయిస్తాం అని ఈటల రాజేందర్ అన్నారు. మొన్న రేవంత్ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చే దాకా కొట్లడతం. మహిళలకు 2500, పేదలకు ఇల్లు, యువతకు 4 వేల భృతి, బాలికలకు స్కూటీ, 2 లక్షల రుణ మాఫీ, వరికి 500 రూపాయల బోనస్, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, కొత్త పెన్షన్, పెన్షన్ పెంపు అన్నీ నెరవేర్చే దాకా ప్రజలతో పాటు ఒత్తిడి తెస్తాం.
1952 మొదటి ఎన్నిక నుండి ఇప్పటివరకు నెహ్రూ తప్ప మూడో సారి ఎవరు ఎన్నిక కాలేదు.కానీ ఆ ఘనత మోడీ గారికి దక్కింది. అప్పుడు స్వతంత్రం తెచ్చిన పార్టీగా నెహ్రూ ఎన్నిక అయ్యారు. కానీ అలాంటి లెగసీ లేకుండా మోడీ గారు ఎన్నిక అయ్యారు.తెలంగాణ ప్రజలు మా మీద పెట్టిన నమ్మకం విశ్వాసం ఒమ్ముకానివ్వం. పదవులు అలంకారం కోసం కాకుండా పనిచేసి చూపిస్తాం. నోట్లో నాలుకగా ఉండి, మీ సమస్యల మీద పోరాటం చేస్తాం.అబ్ కీ బార్ చార్ సౌ పార్.. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. ఇది ప్రజలు ఇచ్చిన నినాదం.ప్రభుత్వం ఏర్పాటుకు 272 సీట్లు కావాలి, మాకు 296 వచ్చాయి. పదేళ్ల తరువాత మిగతా ప్రభుత్వాలు కూలిపోతే మళ్ళీ లేవలేకపోతున్నాయి. కానీ పదేళ్ల తర్వాత కూడా మోడీ గారే ప్రధాని కావాలని ఎన్నుకున్నారు.