తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అని ,వాటిని చేరపడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని అన్నారు. కేసీఆర్ ఆనవాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటెరియట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ లోనే మీ ముఖ్యమంత్రి వెనుకాలనే ఠీవి గా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణ లో ఎక్కడికి వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్ ఆనవాళ్లు మీ కంటే ముందే ఉంటాయని అన్నారు.
కాంగ్రెస్ చెరిపి వేయాలనుకున్న భగత్ సింగ్, సర్దార్ పటేల్,నేతాజీ సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, పీవీ మొదలైన వారి ఆనవాళ్లు ఎవరూ చెరిపి వేయలేక పోయారని గుర్తు చేశారు. గాంధీ, నెహ్రూ ఆనవాలు 75 s సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరూ చెరిపేయలేకపోయారని, అలాగే కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణ లో చెరిపి వేయడం మీ తరం కాదని ఆయన అన్నారు.