ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కించపరుస్తున్నారు: హరీశ్ రావు

-

శాస‌న‌స‌భ‌లో ప‌దేప‌దే బీఆర్ఎస్ నాయ‌కత్వాన్ని విమ‌ర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మరొకసారి మండిపడ్డారు.సీఎం రేవంత్ ప్రతీసారి అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తూ ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ నేతల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి కాంగ్రెస్ వాళ్లకు తెలియదని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలను కాంగ్రెస్ నేతలు ఏనాడూ పరామర్శించలేదన్నారు. సభ హుందాతనం తగ్గేలా ముఖ్యమంత్రి మాట్లాడారని విమర్శించారు.

ఎస్ఎల్‌బీసీ విష‌యంలో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారని ,ప‌దేండ్ల‌లో కిలోమీట‌ర్ త‌వ్వారు అని మొన్న ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో 11 కిలోమీట‌ర్లు త‌వ్విన‌ట్లు హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. దీన్ని ముఖ్యమంత్రి క‌రెక్ష‌న్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేప్పుడు అవ‌గాహ‌న‌తో మాట్లాడాల‌ని సీఎం కి హ‌రీశ్‌రావు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news