టిఆర్ఎస్ పార్టీని అప్పట్లో కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నది వాస్తవమేనని, అయితే ఆ మాటను కాంగ్రెస్ వినలేదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు… ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అది కరెక్ట్ కాదని, వద్దని నేను చెప్పినా వాళ్లు వినలేదు. దీంతో విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. ఆ తర్వాత మేం ఇండిపెండెంట్గా నిల్చొని గెలిచాం’ అని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. దీనిని ఎవ్వరూ తుడిచివేయలేరని ,తనను తగ్గించే ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీవి వికృత రాజకీయ క్రీడలని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని మండిపడ్డారు .దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు కేసిఆర్.