గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వరుసగా 4 సార్లు విజయఢంకా మోగించిందని.. ఈ ఎన్నికల్లోనూ విజయం బీఆర్‌ఎస్‌దేనని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,జగదీశ్‌రెడ్డి అన్నారు.నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని మభ్యపెడుతున్నారని.. బీసీ గణన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట మార్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యువత వీటిపై ఆలోచన చేయాలని.. యువతను నిలువునా ముంచింది కాంగ్రెస్సే అని మండిపడ్డారు.
యువత విచక్షణతో ఓటు వేయాలని.. కోమటిరెడ్డిలాంటి చిల్లర వ్యక్తి అని,అటువంటి నిలకడ లేని వ్యక్తి గురించి మాట్లాడడం వృథా అని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచనతో ఓటు వేయాలన్నారు. కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేస్తే అపాయింట్‌మెంట్ కాపీలను పంచుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారన్నారు.