కల్కి ఆశ్రమంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరదయ్యపాలెంతో పాటు ఇతర ప్రాంతాల్లో లభిస్తున్న డాక్యూమెంట్ల ఆధారంగా మరిన్ని ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. నిన్న ఏపీ, తమిళనాడులోని 40 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే తాజా సమాచారం ప్రకారం 400 మంది అధికారులు 16 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 33 కోట్ల రూపాయలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. వరదయ్యపాలెంతో పాటు ఇతర చోట్ల భారీగా విదేశీ కరెన్సీ వెలుగు చూసింది.
కల్కి భగవాన్ తనయుడు కృష్ణ దాసాజి ఇంట్లో 9 కోట్ల అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు తమిళనాడులో వెయ్యి ఎకరాలకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులకు లభించాయి. ఇదే సమయంలో ఆఫ్రికాలో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా వెలుగు చూసినట్టు సమాచారం. కల్కి భగవాన్ ట్రస్ట్ సీఈవో లోకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.