హుజూర్‌న‌గ‌ర్లో ఆఖ‌రి అస్త‌శ‌స్త్రాలు రెడీ

-

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచా రానికి ఈనెల 19 సాయంత్రంతో తెరపడనుంది. మిగిలి ఉన్న ఈ కొద్ది స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. చివరగా ముఖ్య నేతలను ప్రచారానికి దింపుతున్నాయి. గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు. 18, 19 తేదీల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారైంది.

సీఎం కేసీఆర్‌.. ఈనెల 17న హుజూర్‌నగర్‌ సమీపంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బ హిరంగ సభకు హాజరుకానున్నారు. చివరి ప్రచార అంకంలో కేసీఆర్‌ సభకు భారీగా జన సమీకరణ చే యాల‌ని  ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ సభపైనే టీఆర్‌ఎస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. ప్రచారం జరుగు తున్న తీరుతో తమ విజయం ఖాయమని, కేసీఆర్‌ సభ సక్సెస్‌తో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.


సభలో నియోజకవర్గానికి సంబంధించి సీఎం ఇచ్చే హామీలు, ప్రసంగమే కీలకమని ఆ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా సీఎం స‌భ అనంత‌రం మిగిలిన రెండు రోజులు కూడా ఏ మాత్రం విశ్ర‌మించ‌కుండా, ప్ర‌చారం కొన‌సాగించాల‌ని గులాబీ నేత‌లు భావిస్తున్నారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి పాగా వేసేందుకు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్ర‌మి స్తున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిని గెలిపించుకునేందుకు పార్టీలోని కీల‌క నేత‌లంద‌రినీ రంగంలోకి దించ‌డంలో ఆయ‌న స‌ఫ‌ల‌మ‌య్యారు. వారంతా ఇప్ప‌టికే హుజూర్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం చేప‌ట్టారు.

తాజాగా యూత్‌లో మంచి ప‌ట్టున్న టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్ర‌చారంలో బ్ర‌హ్మాస్త్రంగా ఉప‌యోగించుకోనున్నారు. ముఖ్య‌మంత్రి స‌భ త‌ర్వాత చివ‌రి రెండు రోజుల్లో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో ఆయ‌న రోడ్‌షో ఉండేలా కాంగ్రెస్ షెడ్యూల్ ఖ‌రారు చేసింది. రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న వ‌ల్ల విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. మొత్తానికి ఆయా పార్టీల అగ్ర‌నేత‌ల రాక‌తో హుజూర్‌న‌గ‌ర్ లో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత రాజుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news