బంధాన్ని పలుచన చేసే బాడీలాంగ్వేజ్ పొరపాట్లు.. అస్సలు చేయకండి.

-

బంధాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపొచ్చాలు రావడం సహజమే. వాటిని ఎవ్వరూ ఆపలేరు. కానీ, కొన్నింటిని మీరు ఆపవచ్చు. అవి మీవల్లే జరిగి ఉంటాయి. ఉదాహరణకి మీ బాడీ లాంగ్వేజ్ కారణంగా బంధాలు పలుచన అయ్యే సందర్భాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చేతులు కట్టుకోవడం

అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చుండడం చిన్నప్పుడు వినయానికి నిదర్శనం అయితే అయ్యుండవచ్చు. కానీ ఒక బంధంలో ఉన్నప్పుడు అలా ప్రవర్తించడం వల్ల అవతలి వారు చెప్పేదాని పట్ల మీకు ఆసక్తి లేదని సిగ్నల్ పంపినట్టు అవుతుంది.

వేలెత్తి చూపడం

ఇది అస్సలు సరైనది కాదు. దీనివల్ల అవతలి వారికి లెక్చర్ ఇస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల మీపట్ల సరైన ఆలోచనతో ఉండలేరు.

వంగి నిలబడడం

నిటారుగా కాకుండా భుజాలు వంగిపోయి, మెడ ముందుకు సాగుతూ నిలబడడం వల్ల అవతలి వారికి మీ పట్ల నమ్మకాన్ని తగ్గిస్తుంది. నిటారుగా నిలబడి మాట్లాడేవారిలో నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఫోన్ చెక్ చేసుకోవడం

ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు ఫోన్ చేక్ చేసుకుంటూ కూర్చుంటే మరొకరికి మాట్లాడాలన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అపోజిట్ సెక్స్ పై ఇది మరింతగా ప్రభావం చూపిస్తుంది. అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఫోన్ చెక్ చేసారా? ఒకసారి చూసుకోండి.

కళ్ళలోకి చూడకపోవడం

మీ భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలోకి చూడకుండా మాట్లాడుతున్నట్లయితే, వారి నుండి ఏదో దాస్తున్నట్టు, మాట్లాడడానికి ఆసక్తి లేనట్లు ఫీలవుతారు. అది బంధానికి బీటలు ఏర్పడడానికి కారణం కావచ్చు.

కౌగిలింత లేకపోవడం

కౌగిలించుకుని చాలా కాలం అయ్యిందంటే మీ మధ్య ప్రేమ పోయిందని అర్థం. భాగస్వాముల మధ్య రోజుకి కనీసం 3నిమిషాలైనా కౌగిలింత ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version