బుర్ఖా ధరించి అల్లాహో అక్బర్ అన్న ఆ మహిళకి మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐఫోన్ ని బహుమతిగా ఇచ్చారు…!

-

ముస్లిం విద్యార్థుల బుర్ఖా వివాదం గురించి తెలిసిందే. కర్నాటకలోని ఉడిపిలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీ (పియుసి) తరగతి గదుల్లో కొంతమంది ముస్లిం విద్యార్థినులకు బురఖా ధరించడానికి అనుమతిని నిరాకరించారు. అయితే ఇస్లాంవాదులు ముస్కాన్ ఖాన్‌కు బహుమతులు మరియు రివార్డులను ఇస్తున్నారు.

 

ఆమె అల్లాహో అక్బర్ అంటూ బుర్ఖా ధరించి ముందుకి రావడంతో ఆమెని ఇస్లాంవాదులు ప్రశంసిస్తున్నారు. శుక్రవారం ఫిబ్రవరి 11, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ మాండ్యాలోని ఆమె ఇంటికి వెళ్లి ఐఫోన్ మరియు స్మార్ట్ వాచ్‌ను అందజేశారు. అలానే ఇంత ధైర్యం వున్న మహిళని కలవడానికి ఇంత దూరం నుండి వచ్చానని అన్నారు. ఆమె చేసిన పనికి నేను సంతోషిస్తున్నాను అని అన్నారు. ఈరోజు మొత్తం కర్ణాటక, యావత్ దేశం ఆమె ధైర్యాన్ని చూసి గర్వపడుతున్నట్టు చెప్పారు.

స్త్రీ శక్తి ఏమిటో ఆమె చూపించింది అని అన్నారు. ఆమె చేసిన ఈ సాహసానికి ఒత్తిడికి గురవుతున్న వారు, వేధింపులకు గురవుతున్నవారు, అన్యాయం జరిగేవారు కూడా ఎదిరించగలరని అన్నారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే హిందూ విద్యార్థులను ‘జాలీమ్‌లు’ అంటే క్రూరమైనవారు అని సంభోదించారు. హిజాబ్ ధరించడం ముస్లింల రాజ్యాంగ హక్కు అని అన్నారు.

ఎవరికి నచ్చిన దుస్తులను వారు ధరించవచ్చు అని అన్నారు. హిజాబ్ ధరించే హక్కును కాపాడేందుకు ముస్కాన్ వెనుక కోట్లాది మంది సోదరులు వున్నారని అన్నారు. బుధవారం నాడు ఇస్లామిక్ సంస్థ జమియత్ ఉలమా-ఇ-హింద్ ముస్కాన్ ఖాన్‌కు రూ.5 లక్షల నగదు బహుమతిని ఇచ్చారు. దియోబంద్ ఆధారిత ఇస్లామిక్ సంస్థ ఆమె హక్కులని కాపాడుతోంది అంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version