అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరాఠీ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమై ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మృణాళిని ఠాకూర్, షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ జెర్సీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా మృణాళిని ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్.. 17 -20 ఏళ్ల వయసు మధ్యలో తాను ఇంటి నుంచి దూరంగా వున్నానని తెలియజేసింది. ముంబై నగరంలో ఒంటరిగా జీవించానని.. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.
అది మాత్రమే కాదు చదువుకునే రోజుల్లో రోజూ లోకల్ ట్రైన్ లో తిరిగేదట.. ఆ సమయంలో సీటు దొరికేది కాదని.. అలాంటప్పుడు ట్రైన్ లో నుంచి దూకేయాలనిపించేదని మృణాళిని ఠాకూర్ చెప్పుకొచ్చింది. ఇలా మృణాళిని ఠాకూర్ తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను చెప్పుకొచ్చింది. త్వరలోనే మృణాలిని ఠాగూర్ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా లెఫ్టినెంట్ రామ్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.