తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని తరిమేయడం కాదు.. నిన్నే తెలంగాణ నుంచి తరిమేరస్తారని హెచ్చరించారు వైఎస్ షర్మిలా. అయ్యా కేసీఆర్ గారు, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు అని డిమాండ్ చేశారు.
రోజు కిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రధాని మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ..నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో అని చురకలు అంటించారు. మీరు పులి బిడ్డయితే మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు? అంటూ నిలదీశారు.
నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టినవా? రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? అని ఫైర్ అయ్యారు.గాలిలో మేడలు… పగటి కలలు… ఓట్ల కోసం తిప్పలని కెసిఆర్ పై మండిపడ్డారు వైఎస్ షర్మిల.