బీజేపీలో విలీనం కాదు.. పొత్తు కూడా ఉండదు – BRS MLA

-

బీజేపీలో విలీనం కాదు.. పొత్తు కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్‌ను ప్రశ్నిస్తే నష్టపోతారని కవితకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

jagadeesh reddy
jagadeesh reddy counter to kavitha

 

మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.. అలానే మోస పూరితంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు. పదే పదే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి వేద్దాం అనుకుంటే, 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news