రేవంత్ రెడ్డి పై జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్..పులి వేషం వేస్తే పులులు కారు..!

టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెత్తగాళ్లకు వచ్చేదే చెత్త ఆలోచనలు, జోకర్లు, బ్రోకర్లలా మాట్లాడడం వారి విజ్ఞత అంటూ మండి పడ్డారు. జీవితంలో ఒక్క రోజైనా బాధ్యతాయుతంగా పనిచేయని వారికి ఏమి తెలుస్తుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసలు నీకు పదవి ఎలా వచ్చిందో నీ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టిఆర్ ఎస్ క్యాడర్ లో నూతన ఉత్తేజం చూసి రేవంత్ రెడ్డికి మతిభ్రమించింది అంటూ జ‌గ‌దీష్ ఎడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

పెద్దాయనను తిడితే పెద్దలు కాలేరని, పెద్దలను అనుకరిస్తేనే పెద్దవాళ్ళం అవుతాం అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. పులి వేషం వేస్తే పులులు కాలేర‌ని, రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలి, ఆ భాష మాకు వచ్చు అంటూ హిత‌వు ప‌లికారు. ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోందన్నది గమనించాలి అంటూ సూచించారు. సిఎండి ప్రభాకర్ రావు నివేదిక ఎక్కడ ఇచ్చారు, ఏ ఏ అధికారులు ఎక్కడికి పోతున్నారో నీకు చెప్పాలా…….అంటూ జ‌గ‌దీశ్వ‌రెడ్డి రేవంత్ ను ప్ర‌శ్నించారు.