మెగా ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌ : ”బోలా శంకర్‌” నుంచి బిగ్‌ అప్డేట్‌

-

మెగా స్టార్ చిరంజీవి… గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతుంది.

ఇక సినిమా ఏకే ఎంటర్‌ టైన్ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కుతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తోంది. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజ కార్యక్రమం ముహుర్తాన్ని ఫైనల్‌ చేసింది. వచ్చే నెల 11 వ తేదీన.. ఉదయం 7.45 గంటలకు ఈ సినిమా పూజ కార్యక్రమం జరుగనున్నట్లు చిత్ర బృందం ప్రకటిచింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news