నుపూర్‌ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జగదీష్ మార్కెట్‌ బంద్‌

-

నుపూర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగానే కాకుండా, ముస్లిం దేశాలలో కూడా నిరసన జ్వాలలు రగుల్చుతున్నాయి. అయితే ఇప్పటికే ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇటీవల యూపీల ఈ విషయమై అల్లర్లు చెలరేగాయి. అయితే ఇప్పుడు తాజాగా నుపూర్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఏరియా అయిన జగదీష్ మార్కెట్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వాఖ్యలు చేసిన నుపూర్ శర్మ ను వెంటనే అరెస్ట్ చేయాలిని డిమాండ్ చేశారు.

ఒక్క రోజు బంద్ నిర్వహించిన జగదీష్ మార్కెట్ మొబైల్ షాప్ యజమానులు. OUR PROPHET – OUR HONOUR పేరుతో.. బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. నుపూర్ శర్మ పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు.. శాంతియుత నిరసనలు చేస్తామని, జగదీష్ మార్కెట్ మొబైల్ షాప్స్ యజమానులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version