ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో చేస్తున్న ఉద్యమం రోజు రోజుకి తీవ్రరూపం దాల్చడం, రైతులు మహిళలు, చిన్నారులు కూడా దీక్షలు చేయడంతో ప్రభుత్వం కాస్త ఇబ్బంది పడుతుంది. జగన్ కూడా రాజధాని ప్రాంతానికి వెళ్ళే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్రం దీనికి అడ్డు పడుతుంది అనే ప్రచారం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. విశాఖ ప్రజలు జగన్ ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ ప్రకటన తర్వాత ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఉత్తరాంధ్రకు అనుకూలంగా రాలేదు, దానికి తోడు హిందుత్వ సంస్థలు ఈ విషయంలో దూకుడు పెంచడం, కేంద్రం కూడా సీరియస్ గా ఉందనే వార్తలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్తితిలోకి నేట్టేసాయి అనేది వాస్తవం.
దీనితో ఉత్తరాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రాయలసీమ లో కూడా హైకోర్ట్ విషయంలో జగన్ నుంచి స్పష్టత రావడం లేదు. వాస్తవానికి హైకోర్ట్ విషయంలో సుప్రీం కోర్ట్ జోక్యం ఉంది. సుప్రీం కోర్ట్ ఆదేశాలతోనే అమరావతిలో హైకోర్ట్ ఏర్పాటు అనేది జరిగింది. దీనితో జగన్ కి ఇప్పుడు రాజధాని ప్రకటనలో ముందుకి వెళ్ళడం అనేది చాలా కష్టం. వెనకడుగు వేస్తే మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఈ వ్యవహారం నుంచి జగన్ ఎలా బయటపడతారు అనేది చూడాలి.