అతిపెద్ద రాజకీయం కుటుంబానికి  జగన్ దిమ్మతిరిగే ఆఫర్ ..?

-

రాష్ట్ర విభజన జరగక ముందు వరకు నెల్లూరు మరియు చిత్తూరు రాజకీయాల్లో రాజకీయంగా పనబాక కుటుంబానికి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించారు పనబాక దంపతులైన పనబాక  కృష్ణయ్య, పనబాక ల‌క్ష్మి. పనబాక లక్ష్మి… వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో నెల్లూరు రిజర్వుడ్ నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తరువాత కేంద్ర మంత్రిగా కూడా యూపీఏ హయాంలో చక్రం తిప్పారు. కాగా విభజన జరిగిన తర్వాత కూడా 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసిన ఈ దంపతులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు అంటీ అంటనట్లుగా ఉంటూ సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు పనబాక లక్ష్మి తన భర్తతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలోనే తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా పనబాక కుటుంబానికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళితే తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా సన్నిహితంగా ఉండే పనబాక కుటుంబానికి రాజకీయంగా హెల్ప్ అవ్వాలని జగన్ పనబాక లక్ష్మిని రాజ్యసభకు పంపించాలని గతంలో అనుకున్నారట.

 

ఇదే తరుణంలో అంతా ఓకే అయితే టీడీపీకి బాయ్ చెప్పాలని పనబాక కుటుంబం కూడా రెడీ అయినా క్రమంలో జగన్ మండలి రద్దు చేయడంతో…అంతలోనే ఈ కుటుంబానికి ట్విస్ట్ ఇచ్చినట్లయింది అని తాజాగా పార్టీలో టాక్ వినబడుతోంది. విషయంలోకి వెళితే శాసన మండలి రద్దు తో ఇద్దరు మంత్రుల లో ఒకరిని రాజ్యసభకు పంపించే ఆలోచన జగన్ తీసుకోవటంతో పనబాక కుటుంబానికి షాక్ ఇచ్చినట్లు అయిందని వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version