షాకింగ్; ఢిల్లీ అల్లర్లలో హైదరాబాద్ విద్యార్ధులు…?

-

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లు ఏ స్థాయిలో దేశం పరువు తీసాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీ లో జరిగిన ఆందోళనలు చూసి దేశం కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు ఢిల్లీ లో ఈ విధంగా హింస జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందని, ప్రతీ విషయంలో హడావుడి చేసే మీడియా ఎందుకు ఢిల్లీ అల్లర్లను హైలెట్ చేయలేదని పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇది పక్కన పెడితే ఢిల్లీ అల్లర్లలో హైదరాబాద్ విద్యార్ధులు ఉన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఢిల్లీ అల్లర్లకు దాదాపు నెల రోజుల ముందే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసారని, ప్రధానంగా రెండు విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్ధులు ఢిల్లీ అల్లర్లలో ఎక్కువ ఉత్సాహంగా పాల్గొన్నారని, వాళ్లకు కొందరు ఆర్ధిక సహాయం కూడా చేసారని వార్తలు వస్తున్నాయి.

నిఘా వర్గాలు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాయి అని అంటున్నారు కొందరు. ఇప్పటికే విద్యార్ధులకు సంబంధించిన ఆధారాలను కూడా కేంద్ర నిఘా వర్గాలు సేకరించాయి అంటున్నారు. వారిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనేది కొందరి మాట. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇందుకు తెలంగాణాలో ఎవరైనా సహకరించారా అనే దానిపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

ఒక కీలక నేత వారికి దిశా నిర్దేశం చేసారని, ఢిల్లీ వెళ్ళగానే ఇక్కడి విద్యార్ధులను అక్కడ కొందరు తమ వద్ద ఉంచుకుని అల్లర్లు జరిగిన మూడు నాలుగు రోజుల్లో బయటకు పంపించారని, అల్లర్లు పూర్తి కాగానే వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేశారని అంటున్నారు. విద్యార్ధులకు సంబంధించిన డేటా ను కూడా సంప్రదించి, అల్లర్లు జరిగిన సమయంలో వాళ్ళు కాలేజికి వచ్చారా లేదా అనే దానిని చూడాలని, ఆ మేరకు వివరాలను కూడా కొంత మందిని అడిగినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version