బిగ్ బ్రేకింగ్ : రోజా కి జగన్ గుడ్ న్యూస్ ??

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గెలిచిన తర్వాత మంత్రిపదవులు కేటాయింపు సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు నగరి ఎమ్మెల్యే వైసిపి పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చుక్కలు చూపించింది రోజా. పార్టీ కోసం అనేక అవమానాలు మరియు దాడులు, అక్రమ కేసులు కూడా ఎదుర్కొంది. Image result for jagan rojaఇటువంటి తరుణంలో అందరూ రోజాకి మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్న సమయంలో …జగన్ షాక్ ఇస్తూ ఇతరులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. దీంతో ఆ టైంలో జగన్ మీద రోజా అలగటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజ్యసభకు మంత్రి పదవిలో పెళ్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ ఇద్దరు వెళ్లటంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం తో ఈ రెండు మంత్రి పదవుల్లో ఒకటి రోజా కి ఇవ్వటానికి జగన్ ఆలోచిస్తున్నట్లు పార్టీలో టాక్.

 

కచ్చితంగా రోజాకి మంత్రి పదవి వస్తే మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదే టైంలో మరో మంత్రి పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, కోటం రెడ్డి ఇంకా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. మరి రెండు మంత్రి పదవులు జగన్ ఎవరికి కట్టబెడతారో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news