ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్ న్యూస్

-

ఈరోజు అమరావతి క్యాంప్ ఆఫీస్ లో సీపీఎస్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సమీక్ష జరిపిన సీఎం జగన్‌ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. సీపీఎస్‌ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ సమీక్షలో అధికారులు జగన్ వివరించారు. ఈ సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఇచ్చిన నివేదికని సహా టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించామన్న అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌ లో ఉన్నారని అధికారుల వెల్లడించారు. ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందనే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు.

ఈ నేపధ్యంలో ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. అంటే దానికి ఆమోదం లభిస్తే ఆర్తీసి ఉద్యోగులకు కూడా సీపీఎస్‌ వర్తించనుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని జగన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ జీవోలను అమలు చేశామన్న ఆయన మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని అన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉందని ఆయన అనంరు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు విధి విధానాలు రూపొందించాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version