ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని ప్రచారాలు చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. చేసింది చెప్పుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా విఫలం అవుతూనే ఉన్నారు. కొన్ని కొన్ని అంశాల్లో అధికార వైసీపీ గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది.
వీటిని తిప్పికొట్టే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు కనబడటంలేదు. దీనితో ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియా విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గతంలో తన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ని మళ్లీ ఆయన రంగంలోకి దింపే అవకాశాలు కనబడుతున్నాయి. 2017 లో తన వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ కిషోర్ అధికార తెలుగుదేశంను ఇబ్బంది పెట్టారు.
ఇప్పుడు మరోసారి ఆయన జగన్ కి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శాఖల్లో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ బృందానికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. నేపథ్యంలోనే ఆయన బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశాలున్నాయని కొన్ని జిల్లాల్లో ఉన్న పరిస్థితులను సర్వే చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.