మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ హైకమాండ్ కి షాక్ ఇచ్చి ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. జ్యోతిరాదిత్య సింథియా కి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటు ఇటు గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవలీలగా కూల్చే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. మరోపక్క బిజెపి నేతలు కూడా జ్యోతిరాదిత్య సింథియా కి మద్దతు తెలపడానికి రెడీ అయ్యారు.
మొత్తం మీద తాజా పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని వీడినా జ్యోతిరాదిత్య సింథియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింథియా అంతా అనుకున్నట్టు ముఖ్యమంత్రి అయితే 2019 ఎన్నికల తర్వాత అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ తరువాత ఆ రికార్డు కొట్టబోయేది మాత్రం సింథియా అని చాలామంది అంటున్నారు.