బసవ తారకంలో చంద్రబాబు కన్నా.. వైసీపీ హయాంలోనే‌ బిల్లులు తొందరగా క్లియర్ అవుతున్నాయి- సీఎం జగన్

-

బాలక్రుష్ణ నడుపుతున్న బసవ తారకం లో చంద్రబాబు కన్నా మన హయాంలోనే‌ బిల్లులు తొందరగా క్లియర్ అవుతున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీలో వైద్యరంగంపై సీఎం జగన్ మాట్లాడుతూ…3118 వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందుతుంది…నాడు నేడు ద్వారా వైద్య రంగంలో హాస్పిటల్స్ లో రూపు రేఖల మార్పు కోసం 16255 కోట్లు చేస్తున్నామని తెలిపారు.

 

విద్యా రంగంతో వైద్య రంగంలో మార్పులు తెచ్చాం…గత ప్రభుత్వంలో సెల్‌పోన్లు పెట్టుకొని ఆపరేషన్లు చేసేవారు.. ఎలుకలు దూరిన ఘటనలు గత ప్రభుత్వం లో ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని…వైఎస్ మరణాంతరం ఆరోగ్య శ్రీ ని పూర్తిగా విస్మరించారన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ బకాయిలను క్లియర్ చేశాం…ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో రోగులకు డాక్టర్లు మరింత‌ చేరువవుతారని వెల్లడించారు.

 

హాస్పిటల్స్ లో నర్సులు, డాక్టర్లు లేని పరిస్ధితి నుంచి అక్టోబరు 15 కల్లా ప్రతి హాస్పిటల్ లో డాక్టర్లు,‌నర్సులు అందుబాటులో ఉంచుతాం…మూడేళ్ళలో వైద్య రంగంలో 44 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత మన ప్రభుత్వానిదేన్నారు. స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి 11 మెడికల్‌ కాలేజిలు ఉంటే మరో 17 మెడికల్‌కాలేజిలు నిర్మించబోతున్నాం..1268 కోట్లు నాడు నేడు ద్వారా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్ళలో విద్య, వైద్య రంగంలో మార్పులు కనబడతాయని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version