నివర్ తుపాను నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి భారీ వర్షసూచన ఉందని తుపాను నేరుగా ఏపీని తాగకపోయినా.. ప్రభావం ఉంటుందని అన్నారు. నెల్లూరు నుంచి తూ.గో జిల్లా వరకు వర్షాలు పడొచ్చని అందుకే ప్రతి జిల్లా కలెక్టరేట్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన అన్నారు.
కర్నూలు, నంద్యాల, ఆదోనిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వానలు పడే అవకాసం ఉంది.కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ భద్రతా సూచిక ఎగుర వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 100-120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.