జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు కొత్త హామీలతో మాయ మాటలు చెబుతున్నారు అంటూ ఆరోపిస్తూ ప్రస్తుతం బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో ఇప్పటికైనా కేసీఆర్ చెబుతారా అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అరవింద్. రాష్ట్రంలో ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. ప్రజలు కెసిఆర్ మాటలు నమ్మే పరిస్థితులు లేరని అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నే మళ్ళీ ప్రస్తుతం మేనిఫెస్టోలో అదే హామీలను పొందుపరిచి 1, 2 కొత్త హామీలు పెట్టారు అంటూ విమర్శించారు.