జగన్ సర్కార్ ఏపీలో వీఆర్వోలకు శుభవార్త చెప్పింది. గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులలకు అండగా వుంది ప్రభుత్వం అని చెప్పింది. అయితే గ్రేడ్–1, 2 వీఆర్‌వోలు సర్వీస్ లో వుంది చనిపోతే వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
కారుణ్య నియామకానికి అవాకాశాన్ని ఇచ్చింది. సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేసింది. ఈ విషయంపై మార్పులు చేసినట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు.
దీని వలన కలిగే ఉపయోగం ఏమిటంటే గ్రేడ్–1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ ప్యాస్ అయిన భాగస్వామి లేదా పిల్లలకి కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన పోస్ట్ ని ఇస్తారు. వీఆర్‌వోలు ఎప్పటి నుండో ఈ విషయంపై ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఏపీలో వీఆర్వోలకు శుభవార్త చెప్పింది. గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులలకు అండగా నిలిచింది. సీఎం కి ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదములు చెప్పారు. అలానే వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కూడా ధన్యవాదములు చెప్పారు.