రాష్ట్ర వికేంద్రీకరణ మరియు సమగ్రాభివృద్ధి అనే రెండు అంశాలను పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి తరలిస్తున్నట్లు తెలిపిన నేపథ్యంలో దాని వల్ల లాభం ఎంత ఉందో తెలియదు కానీ నష్టం పొందుబోయే వారంతా ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని సచివాలయం ఉద్యోగులంతా ఇప్పుడు జగన్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
అంతకు మునుపు హైదరాబాదు నుండి వారంతా ఈ రాష్ట్రానికి తరలివచ్చి తమ కుటుంబాలను సెటిల్ చేసుకునే పనిలో ఉండగానే చంద్రబాబు ఆకస్మాత్తుగా అమరావతిని రాజధానిగా ప్రకటించి మళ్లీ రెండోసారి వారిని షిఫ్ట్ చేయించారు. ఇక అక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకునేందుకు వారు హోమ్ లోన్ లు వంటివి తీసుకొని ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకుంటే మళ్లీ ఇప్పుడు జగన్ వచ్చి ఒక్కొక్క విభాగాన్ని ఒక చోట ఏర్పాటు చేస్తాననంటే అయిపోవాలని వారు చింతిస్తున్నారు.
అలాగే సరే.. చుట్టుపక్కల దగ్గరలో ఏమన్నా రాజధాని ప్రాంతాన్ని తరలిస్తున్నారు అంటే ఒకటి కర్నూల్లో అయితే మరొకటి వైజాగ్ లో అంటే వారికి వచ్చే జీతంనే ఈ ప్రయాణ ఖర్చులు పెట్టుకుంటే ఈ రోజుల్లో ఉండే ధరలకు ఎలా బ్రతకాలి అని తెగ వాపోతున్నారు. ముఖ్యమంత్రి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని వారి వాదన.