టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడ కోసం చాలా తీవ్రంగా కష్టపడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు తమ మీద కుట్రలు కొన్ని మీడియా సంస్థలతో కలిసి చేస్తున్నారు అనే అనుమానం జగన్ లో ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది.

ఇక ఇక్కడి నుంచి చంద్రబాబుని జగన్ ఫోకస్ చేసారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ముందు ప్రతిపక్ష నేత హోదా ఉండకూడదు అనే భావన లో ఉన్నారట. అందుకే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు నేతలను టార్గెట్ చేసారట. ఒకరు మాజీ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలను జగన్ టార్గెట్ చేసారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ జిల్లాలో కూడా ఇప్పుడు టీడీపీని బలహీనపరిస్తే ఫలితం ఉంటుంది అని భావిస్తున్నారట. అందుకే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసారని అంటున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక వెలగపూడి రామకృష్ణ కాగా మరొకరి పేరు తెలియాల్సి ఉంది. చంద్రబాబు పదే పదే కేంద్రంతో టచ్ లోకి వెళ్ళడమే కాకుండా ఎమ్మెల్యేల ద్వారా లేఖలు రాయించడం వంటివి చేస్తున్నారు. హైకోర్ట్ లో పిటీషన్ లు కూడా వేయిస్తున్నారు. దీనితో ఇప్పుడు జగన్ జాగ్రత్త పడి వాళ్ళను పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే వాళ్ళను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version