ఏపీ సీఎం జగన్ తిరుపతి ప్రచారం పర్యటన రద్దు అయింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు సీఎం లేఖ రాసినట్లు సమాచారం. కరోనా కేసులు వస్తున్నందున రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
14న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని లేఖలో పేర్కొన్న సీఎం, బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు ఒకే చోట చేరితే వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే నాకు ముఖ్యం అని లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ ఓటర్లకు లేఖలో విఙప్తి చేశారు.