“బాబోయ్ జగన్ టార్చర్ పెట్టేస్తున్నాడు” ఇదే చంద్రబాబు ఫీలింగా ??

-

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అందిస్తూ మరోపక్క 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్నారు జగన్ అని అంటున్నారు చాలామంది రాజకీయ మేధావులు. కేవలం అధికారం లోకి వచ్చే ఏడు నెలల్లోనే జాతీయ స్థాయిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతగానో ప్రభావితం చేస్తున్న తరుణంలో జగన్ని రాజకీయంగా ఇబ్బందులపాలు చేయాలని చంద్రబాబు వేస్తున్న ప్రతి పన్నాగాన్ని ఎదుర్కొంటూ దూసుకెళ్లి పోతున్న..

జగన్ రాజకీయ అడుగులు చంద్రబాబుకి టార్చర్ పెడుతున్నట్లు ముఖ్యంగా జగన్ వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అందరి మద్దతు కూడగట్టడంలో సక్సెస్ కావడంతో చంద్రబాబు ఇటీవల తన సన్నిహితుల దగ్గర పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల దగ్గర “బాబోయ్ జగన్ టార్చర్ పెట్టేస్తున్నాడు” వీళ్ళ నాన్న కంటే చాలా డేంజర్ గా ఉన్నాడు అని అన్నట్లు చంద్రబాబు ఫీల్ అయినట్లు…

ఏడు నెలలకే ఈ విధంగా పరిపాలిస్తూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రిగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇలాంటి వాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న డైలమాలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అటు జాతీయ స్థాయిలోనూ మరియు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ జగన్ వేసిన వికేంద్రీకరణ స్టెప్ కి చంద్రబాబుకి రాజకీయ పునాదులు మొత్తం కదిలి పోయినట్లు పేర్కొంటున్నారు రాజకీయ మేధావులు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version