అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

-

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి కానుక‌లు ఇస్తారు. రేప‌టి నుంచి జూలై 9 తేదీ వ‌ర‌కూ జ‌రిగే ర‌థోత్స‌వానికి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాన గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా పెద్ద‌గా భక్తులెవ్వ‌రూ లేకుండానే ర‌థోత్స‌వం. స్వామి ఏకాంత సేవ అన్న‌వి జ‌రిగిపోయాయి. కానీ ఇప్పుడు కాస్త ప‌రిణామాల్లో వ‌చ్చిన మార్పు కార‌ణంగా ఈ సారీ క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త త‌గ్గినందున హాయిగా అంగ‌రంగ వైభ‌వంగా ఈ ఉత్స‌వం జ‌ర‌గ‌నుంది.

 

ముఖ్యంగా మ‌నిషిలో ఉండే అన్ని దుఃఖాలూ తొల‌గించే దేవుడు ఆయ‌న. మ‌నిషి ప‌రిణామ గ‌తికి సంకేతం ఆ దేవుడు. న‌వ చింత‌న‌లూ తొల‌గించే ద‌శావ‌తార దేవుడు. ఇప్పుడు దేవుడ్ని ఎలా కొల‌వాలి.. ఎలా చూడాలి.. క‌ష్టాలు క‌న్నీళ్లు అన్న‌వి లేని చోటు దేవుడు .. కాదు వాటిని దూరం చేసే దేవుడు మ‌నం మ‌న‌నం చేయ‌ద‌గ్గ దేవుడు మ‌న‌లోనే ఉన్నాడు. ఇప్పుడీ దైవిక రూపాన్ని, శాబ్దిక చింత‌న‌ల‌నూ మ‌నం సొంతం చేసుకోవ‌డం ఇవాళ అత్యావ‌శ్య‌కం. పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యంలో విభిన్న ప్రాంతాల సంస్కృతి ఉంటుంది. స్వామి ర‌థ‌యాత్ర చెంత అనేక క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది. జ‌గ‌న్నాథ త‌త్వం ముఖ్యంగా కృష్ణ‌త‌త్వం కీర్త‌న‌ల‌కు ప్రీతిపాత్రం అయి ఉంటుంది. ఇష్టంగా ఆలపించే ఆ కీర్త‌న‌ల చెంత భ‌గ‌వత్ రూపం మ‌రింత శోభిల్లుతుంది.

దేవుడ్ని నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు.. క‌ష్టం,దుఃఖం వీటి రూపాల్లో కూడా మ‌నిషిని కొన్ని ప్ర‌శ్నిస్తాయి మ‌నిషికి కొన్ని స‌హ‌క‌రిస్తాయి..మ‌నం దేవుడు రూపాన్ని ఎదురుగా ఉంచుకుని కొన్ని ప్ర‌య‌త్నాల‌ను వ‌దులుకుంటాం.. దేవుడు మాత్రం మ‌న త‌రఫున ఏదో ఒక మంచి చేయాల‌నే అనుకుంటున్నాడు. ఆ మంచికి మ‌న‌ల్ని ప్ర‌తినిధులుగా మార్చాల‌నే చూస్తాడు. ఆఖ‌రికి కొన్ని సార్లు ఆ మంచి మ‌న రూపంలోనే ఉంది. దేవుడు కేవలం వెనుక ఉండే శ‌క్తి మాత్ర‌మే ! ఇది జ‌గ‌న్నాథ రూపం నేర్పుతోంది.

చిన్న‌గా ప్ర‌పంచాన్నే శాసించే శ‌క్తి ఆ వామ‌న రూపం నేర్పుతుంది. త‌ల్లీతండ్రీ గొప్ప‌త‌నాన్ని దైవిక శ‌క్తే వివ‌రిస్తుంది. మీరు మీ త‌ల్లిదండ్రులనే న‌మ్ముకోండి… వారి శ‌క్తికి విలువ ఇవ్వండి. వారి క‌ష్టాన్ని గుర్తించండి..దైవం కూడా ఆనందిస్తుంది. ఆనందించే ప‌నులు చేయ‌డం ఓ ధ‌ర్మం. దేవుడి ర‌థం మీ వీధి మీదుగా వెళ్ల‌నుంది.. అదిగో ఆ వేడుక వేళ మీ దుఃఖం తొల‌గి ఆనందం నిండే రోజు త‌ప్ప‌క వస్తుంది అన్న అభ‌యం ఒక‌టి ఎక్క‌డి నుంచో వినిపిస్తోంది.వినండి.. అనండి నాథ హ‌రే జ‌గ‌న్నాథ హ‌రే !

Read more RELATED
Recommended to you

Exit mobile version