ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే అసలు వైసీపీకి ఇప్పట్లో తిరుగుండదేమో అనిపిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ పనిచేస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. ఏపీలో ఇంకో పదేండ్లయినా సరే వైసీపిని ఢీకొట్టే నేతలు ఎవరూ పుట్టుకురారేమో అనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే అన్నింటిలోనూ వైసీపీ సంచలన విజయాలే నమోదు చేసిది. అన్ని ఎన్నికల్లోనూ ఏ పార్టీకి అందనంత మెజార్టీని సాధించింది.
ఇక టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు కనుమరుగై పోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఇప్పట్లో కోలుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక ఈ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసినా ఏపీ ప్రజలు అన్ని ఎన్నికల్లోనూ వైసీపీకే జై కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మళ్లీ ఎన్నికలు వచ్చినా ఆ పార్టీదే విజయం అని అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ మాత్రం ఇంకా ఎందుకో జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను రంగంలోకి దింపడం.
చాలామంది సీనియర్లు కూడా ఇప్పట్లో తమ పార్టీకి ఎవరి సపోర్టు అవసరం లేదనే చెబుతున్నారు. తామే సొంతంగా పోటీ చేసి అదే స్థాయి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో తమకు వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వేలు చేయించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి కొంత వ్యతిరేకత ఉందని గ్రహించిన జగన్ తమ మెజార్టీ ఏ మాత్రం తగ్గకుండా ఉండాలంటే ప్రశాంత్ కిశోర్ టీమ్ సపోర్టు తప్పకుండా కావాలని డిసైడ్ అయ్యారంట.