గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయగా.. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకున్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్.. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో పెద్దగా మనం ప్రాధాన్యతగా తీసుకోలేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనం పోటీచేయడమే మంచిందని.. సీఎంతో ఎమ్మెల్యేలు తెలిపారు. ఏకాభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు సీఎంకు నివేదించగా… ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అంగీకరించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లోకి మనం వెళ్తున్నామని.. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టండని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం… ఉమ్మడి విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌స్థానానికి ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఎస్. సుధాకర్ పేరు ఖరారు ఫైనల్ చేశారు.
ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి కాగా.. ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి పేరు ఖరారు అయింది. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుందామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.