మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంకీ పాక్స్ సందేహాలపై ఫోన్ నంబర్లను విడుదల చేసింది సర్కార్. తాజాగా మంకీ పాక్స్ పై మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు నమోదుకాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లు తెలిపారు. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదేనని వెల్లడించారు.
మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 సంపాదించాలని ప్రజలకు సూచించారు.