సౌందర్య తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన జగపతిబాబు..!!

-

అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగింటి ఆడపడుచులా ఎంతో మంది ప్రేక్షకులను తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ వొలకబోస్తేనే అవకాశాలు వస్తాయన్న సమయంలో కూడా నిండుదనంతో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అన్ని వర్గాల వారిని కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇకపోతే అప్పట్లో సౌందర్యను ప్రముఖ హీరో జగపతిబాబు ప్రేమిస్తున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ విషయంపై జగపతిబాబు ఆ ఎఫైర్ వార్త నిజమేనని క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి ఒకప్పుడు హీరోలలో అందరికంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరో ఎవరంటే జగపతిబాబు అనే చెప్పాలి. ఎంతోమంది ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జగపతిబాబు. ఇక ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించిన ఈయన సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చారు జగపతిబాబు.

ఇకపోతే అప్పట్లో జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యేది. ఈ వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ మీద చూడముచ్చటగా కనిపించేవారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇకపోతే సౌందర్యకు తనకు మధ్య ఏదో ఎఫైర్ ఉందనే వార్తలు చాలా పుట్టుకొచ్చాయి తనకు సౌందర్యకు మధ్య ఎఫైర్ ఉందని అనుకుంటున్నారు కదా.. అది నిజమే. ఆమెకు నాకు ఎఫైర్ ఉంది . కానీ మీరు అనుకున్నట్టు కాదు.. ఆమె నాకు మంచి స్నేహితురాలు.. సౌందర్య అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్.. అలాగే మా రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్ గా ఉండేవి. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నా.. మా రెండు కుటుంబాలు మమ్మల్ని అర్థం చేసుకున్నాయి. కానీ సౌందర్య లేకపోవడం ఆ బాధను ఎవరు తీర్చలేనిది అంటూ జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version