జగపతి బాబుకి ఇంత డిమాండ్ ఉందా…?

-

టాలీవుడ్ లో జగపతి బాబుకి విలన్ గా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. జగపతి బాబు సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒక ఆసక్తి ఉంటుంది. మహిళా ప్రేక్షకులు అయితే ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన తెలుగులో బాగా డిమాండ్ ఉన్న విలన్, తండ్రి, వ్యాపారవేత్త ఇలా ఆయన తెలుగులో తన హవాను ఎక్కువగాకొనసాగిస్తున్నారు.

ఇక ఇది పక్కన పెడితే ఆయన కోసం బాలీవుడ్ స్టార్ హీరో లు కూడా పోటీ పడటం గమనార్హం, బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ ఆయన తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జగపతి బాబు తో సినిమా చేస్తే తెలుగులో తనకు కలిసి వస్తుంది అనే భావనలో సల్మాన్ ఖాన్ ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే జగపతి బాబు తో సంప్రదింపులు కూడా జరిపి ఆయన్ను అక్కడ తీసుకోవడానికి గానూ ప్రయత్నాలు చేసారని అంటున్నారు. ప్రస్తుతం జగపతి బాబు కన్నడం లో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు మన తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు అయిన తర్వాత బాలీవుడ్ లో చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు నిర్మాతగా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news