ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో జగ్గుబాయ్ ఎంజాయ్..!

ఒకప్పుడు హీరోగా నటించిన జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోల కంటే విలన్ గానే జగపతిబాబు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. లెజెండ్ సినిమా లో జగపతి బాబు నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. తర్వాత జగ్గు భాయ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. అయితే జగపతి బాబు ఎంతో క్రేజ్ ఉన్న నటుడు అయినప్పటికీ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా బయట కూడా నిరాడంబరంగా జీవించాలి అనుకుంటారు.

అప్పట్లో ఓ రోడ్డు పక్కన దాబాలో టిఫిన్ చేసి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా జగపతిబాబు చెన్నై లోని ఓ హోటల్ లో లంచ్ కు వెళ్లారు. అయితే అదే హోటల్లో లంచ్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు జగ్గు భాయ్ ని పలకరించారు. దాంతో వాళ్లతో కలిసి లంచ్ ఎంజాయ్ చేసిన జగపతిబాబు ఓ ఫోటో కూడా దిగారు. ఇక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జగపతి బాబు ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సరదాగా లంచ్ చేశాను అంటూ పేర్కొన్నారు.