బ్రేకింగ్ : కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ ?

కిడ్నాప్ వ్యహహారంలో భూమా కుటుంబ సభ్యుల పాత్ర పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల అదుపులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఉన్నట్టు చెబుతున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు జగత్ కిడ్నాపర్లతో మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ అరెస్టు సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని విచారించిన పోలీసులు, అతని నుండి వివరాలు సేకరించి వదిలేశారు.

జగత్ విఖ్యాత్ డ్రైవర్ చెప్పే ఆధారాలతో మరోసారి అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బేగంపేట్ మహిళ పోలీస్ స్టేషన్ లో అఖిల ప్రియ విచారణ ప్రారంభమయింది. మూడు రోజుల కస్టడీ లో భాగంగా రెండో రోజు విచారిస్తున్నారు పోలీసులు.  కిడ్నాప్ వ్యవహారం లో అఖిల ప్రియ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది దర్యాప్తు టీం. బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన డిసిపి కమలేశ్వర్, అఖిలప్రియను ప్రశ్నిస్తున్నారు.