2014 నుంచి ఇరిగేషన్ శాఖ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్విర్యం అయ్యాయి అని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసిపి పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసిపి పాలనలో చేయలేకపోయారు. గాడి తప్పిన ఇరిగేషన్ శాఖను తిరిగి గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది.
2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం లో డెబ్భై వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించాం. 2019 నుంచి 24 వరకు వైసీపీ 32 వేల కోట్లు కేటాయించి 19 వెల కోట్లు ఖర్చు చేశారు. బడ్జెట్ తక్కువగా ఉన్న కూడా 9.6 శాతం టీడీపీ కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం లో 2.3 శాతం మాత్రమే కేటాయించింది. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం చూస్తుంటే మాకే బాదేస్తుంది. 2014-19 లో బడ్జెట్ తక్కువగా ఉన్న 12 వేల కోట్లు రాయలసీమ కు కేటాయించాము. 2019-24 వైసీపీ పాలనలో 2200 కోట్లు మాత్రమే రాయలసీమ కు కేటాయించారు అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.