సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది పండుగ రోజున స్టోరీ లైన్ వింటానని కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే జగ్గారెడ్డి ఆదివారం ఉగాది సందర్భంగా జయలక్ష్మీ సినిమాస్ పేరుతో నూతన ఆఫీస్ ప్రారంభించారు.
సినిమా ఆఫీస్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించడంతో సర్వత్రా చర్చ నెలకొన్నది.అంతటితో ఆగకుండా 50 సెకన్లతో టీజర్‌ను కూడా జగ్గారెడ్డి రిలీజ్ చేశారు. ఇదిలాఉండగా, జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను కథగా తీసుకుని డైరెక్టర్ రామానుజం సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు జగ్గారెడ్ది అనే టైటిట్ కూడా ఫిక్స్ చేయడంతో పాటు పోస్టర్ కూడా విడుదల చేశారు.
సినిమా ఆఫీస్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
జయలక్ష్మీ సినిమాస్ పేరుతో నూతన ఆఫీస్ ప్రారంభం
50 సెకన్లతో టీజర్ రిలీజ్ చేసిన జగ్గారెడ్డి
జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను కథగా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ రామానుజం pic.twitter.com/EnamZnMOLu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2025