సోనియమ్మ వల్లే కేసీఆర్ సీఎం: జగ్గారెడ్డి

-

బీజెపి, బీఆర్ఎస్ పార్టీల మీద కాంగ్రెస్ సీనియర్ నేతైన జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని అన్నారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని అన్నారు.

కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు. కనుక కేసిఆర్ సీఎం అయ్యాడని సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇందిరాగాంధీ స్వతంత్ర ఉద్యమంలో ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించారని ఆయన గుర్తు చేశారు. సో స్వతంత్రం కోసం జైలుకెళ్ళినట్లు ఏ బీజెపి నేతకైనా చరిత్ర ఉందా అని నిలదీశారు ఇందిరామ్మకి ఉన్న చరిత్ర మోడీ అమిత్ షా కి ఉందా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news