సీఎం కేసీఆర్ ని పొగిడిన జగ్గారెడ్డి !

-

సంగారెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ని మెడికల్ కాలేజీ కోసం ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ అడిగానని అన్నారు. దీనిపై సీఎం అనుకూలంగా స్పందించారని.. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం వల్ల చుట్టుపక్కల పెద వాళ్ళకి అందుబాటులో ఉంటుందన్నారు. ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు దొరుకుతాయి అన్నారు. గాంధీ, ఉస్మానియా కి దీటుగా ఈ కాలేజీ ఉంటుందని అన్నారు జగ్గారెడ్డి.

ఇక్కడికి వచ్చే పేషెంట్ అటెండర్స్ కి రాత్రి పడుకోవడానికి సౌకర్యం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు లేఖ రాస్తానని అన్నారు. ఆసుపత్రి ఈరోజు వెయ్యి మంది రోగులు వస్తున్నారు, ఇదంతా జరగడానికి సీఎం సహకారం చాలా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం ని పొగడగ తప్పదు అన్నారు జగ్గారెడ్డి. పొగుడుతున్న అని తప్పుగా అనుకోవద్దన్నారు. స్వయంగా కేసీఆర్ వచ్చి ఆస్పత్రిని ప్రారంభిస్తారని, పార్టీలు ఏవైనా ఏమైనా పని జరగాలంటే అందరి సహకారం కావాలి అన్నారు. సంగారెడ్డి ప్రజలకు ఈ కాలేజీ ఓ వరంలాంటిదన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version