జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు !

-

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైల్ డిఫరెంట్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… వార్తల్లో నిలుస్తారు జగ్గారెడ్డి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… కొత్త పార్టీ పెట్టేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

jaggareddy | జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లకుండా తానే ఒక పార్టీ పెట్టాలని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అంతే కాదు తెలంగాణ కాంగ్రెస్ పేరుతో ఈ పార్టీని తీసుకువచ్చి… తెలంగాణ ఉద్యమకారులను కలుపుకోవాలని జగ్గారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి గా ఉన్నటువంటి నేతలను తన వైపు లాగేసుకుని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు సాగాలని అన్నారు జగ్గారెడ్డి. దీనిపై ఇవాళ సాయంత్రం లోపు ఓ కీలక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సమాచారం అందుతోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ల మధ్య పచ్చగడ్డి వేస్తే మండేలా వ్యవహారాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version