కుంభమేళాకు వెళ్ళిన మోడీ..మేడారం ఎందుకు రాలేదు ? : ఎర్రబెల్లి

-

కుంభమేళాకు వెళ్ళిన మోడీ..మేడారం ఎందుకు రాలేదు ? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. మేడారం జాతర కు జాతీయ హోదా ఇవ్వని వారు ఇక్కడ రాజకీయ లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఎం మాట్లాడుతూన్నారో తెలియదని ఎద్దేవా చేశారు. అమ్మ సన్నిధి లో పార్టీ ల మద్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

ఎడేల్లు గా పాలన చేస్తున్న మోది మేడారం జాతర కు ఎందుకు రాలేదని అగ్రహించారు. ప్రతి గుడి కి వెళ్లే ప్రధాని మోడీ ఆదివాసీల జాతరకు ఎందుకు రారు అని నిలదీశారు. మేడారం జాతర కు జాతీయ హోదా తేలేని కిషన్ రెడ్డి కి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.

కుంభమేళా కు 320 కోట్లు కేటాయించి మేడారం జాతరకు 2 కోట్లు కేటాయిస్తారా ? అని అగ్రహించారు. ఆదివాసి ల పట్ల వివక్ష చూపుతున్న పార్టీ బిజెపి అని ఫైర్ అయ్యారు. బిజెపి వైఖరి మార్చుకోక పోతే రానున్న రోజుల్లో ఉరికించి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version