ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్న ” జై హనుమాన్ “.. ఎప్పుడంటే..!

-

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్గా తేజ సజ్జ ,ప్రశాంత్ వర్మలు ఇచ్చిన హింట్స్ తో అయితే హనుమాన్ సీక్వెల్ నుంచి అప్డేట్ ఈ ఏప్రిల్ లోనే రాబోతున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ ఉగాది కానుక గానే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఏప్రిల్ 9న రానున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ భారీ సినిమాకి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news