అతను చాలామంది జీవితాలను నాశనం చేసిండు : చికోటి ప్రవీణ్‌

-

సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై డీజీపీకి బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పెద్దల అండతో రాధాకిషన్‌రావు అరాచకాలు చేశారని చికోటి ప్రవీణ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని పేర్కొన్నారు. తనపై పీడీ యాక్టు కేసులు పెడతానని రాధాకిషన్‌రావు బెదిరించినసట్లుగా చికోటి ప్రవీణ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.

రాధకిషన్ రావు కు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాధకిషన్ రావు ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయించాలని చికోటి ప్రవీణ్‌ డిమాండ్ చేశారు. సినిమా హీరోయిన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ,దీనిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని… విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాధకిషన్ రావు బాధితులంతా బయటకి రావాలని చికోటి ప్రవీణ్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news