అమెజాన్ లో గ్రాండ్ గా సెప్టెంబర్ 7న “జైలర్” విడుదల !

-

ఓటిటి లో ప్రతి వారంలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వారంలో కూడా కొన్ని సినిమాలు ఓటిటి ఛానెల్స్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ మోస్ట్ వాంటెడ్ గా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక ఇదే ఛానెల్ లో వన్ షాట్ వెబ్ సిరీస్, లక్కీ గౌ, సిట్టింగ్ బార్స్ విత్ కేక్ లు రిలీజ్ కానున్నాయి. హాట్ స్టార్ లో ఐ యామ్ గ్రూట్, ది లిటిల్ మెర్మైడ్ లు రిలీజ్ కానున్నాయి. ఇక జీ5 లో హడ్డీ రిలీజ్ కానుంది.

ఇక నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే, స్కాట్ హానర్, షేన్ గిల్లీస్, టాప్ బాయ్, కుంగ్ పూ పాండా, వర్జిన్ రివర్, సెల్లింగ్ ది ఓసీ లు విడుదల కానున్నాయి. అయితే ప్రత్యేక ఆకర్షణగా మాత్రం జైలర్ మూవీ నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news